: ఇక అవయవదానం అవసరం ఉండదు


వైద్య విధానంలో సరికొత్త విధానాన్ని రూపొందించడానికి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు కృషి చేస్తుంటారు. ఈ నేపధ్యంలో దెబ్బతిన్న లేదా జబ్బుబారిన పడిన అవయవాల రక్తనాళంలోని కణాలతో మరమ్మత్తు చేసే సరికొత్త వైద్య విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సరికొత్త వైద్యం అందుబాటులోకి వస్తే అప్పుడు అవయవదానం, అవయవాల మార్పిడి వంటివాటి అవసరం లేకుండానే వైద్యం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

శరీరంలోని రక్తకణాల నిర్మాణాన్ని తీర్చిదిద్దే ఎండోలీథియల్‌ కణాలు చాలా శక్తిమంతమైనవి. ఇవి శరీరానికి జీవ యంత్రాల్లాంటివి. ప్రయోజనకరమైన, అవయవ సంబంధమైన పరమాణువులను విడుదల చేయడం ద్వారా అవయవాల కణజాల పునరుత్పాదనను ప్రేరేపిస్తాయి. ఇంతటి శక్తిమంతమైన ఎండోలీథియల్‌ కణాల్లోని క్రియాశీలక జన్యువులను డీకోడింగ్‌ చేయడం ద్వారా అవయవాలు తమ రక్తనాళాలు, వాటి మరమ్మత్తును పరమాణువులు నిర్దేశిస్తాయని, దీనిద్వారా దెబ్బతిన్న లేదా జబ్బున పడిన అవయవాలకు వైద్యం చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఇలా తీర్చిదిద్దిన ఎండోలీథియల్‌ కణాలను ఇంజక్షన్‌ ద్వారా శరీరంలో అవసరమైన చోట ఎక్కించినప్పుడు అవి గాయపడిన కణజాలంలోకి వెళ్లి, అవయవానికి మరమ్మత్తు చేసే సామర్ధ్యాన్ని పెంచుతాయని అన్సారీ స్టెమ్‌సెల్‌ ఇన్‌స్టిట్యూట్‌, ట్రైసై స్టెమ్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు షహీన్‌ రఫీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News