: జగన్ దీక్ష భగ్నం ... బలవంతంగా ఆసుపత్రికి తరలింపు
వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను కొన్ని క్షణాల క్రితం పోలీసులు బలవంతంగా ఎత్తుకుని అంబులెన్సులో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఉస్మానియా వైద్యులు నివేదిక ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. జగన్ ను తీసుకువెళుతుండగా అభిమానులు, కార్యకర్తలు 'జై సమైక్యాంధ్ర' నినాదాలతో లోటస్ పాండ్ ప్రాంతాన్ని హోరెత్తించారు.