: కొడుకులాంటి వాడు కాబట్టే బెయిల్ ఇప్పించారు: దేవినేని ఉమ
జగన్ తన కొడుకులాంటి వాడని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ స్పందించారు. కొడుకులాంటి వాడు కాబట్టే ఏ1 నిందితుడైన జగన్ కు బెయిలిప్పించారని ఎద్దేవా చేశారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షపై మాట్లాడుతూ, భగ్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 70 రోజులుగా సీమాంధ్ర ఆందోళనలతో అట్టుడుకుతుంటే కేంద్రానికి చీమకుట్టినట్టయినా లేదని మండిపడ్డారు.