: ఉద్యోగులకు దసరా సెలవులు రద్దు: ఒడిశా సర్కారు
తుపాను ముప్పు పొంచివున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దసరా సెలవులను రద్దు చేసింది. తుపాను ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 14 జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేసి సహాయక చర్యలకు సిద్థంగా ఉండాలని ఆదేశించింది.