: తెలంగాణకు కేవీపేయే అడ్డు: మధుయాష్కీ
తెలంగాణ రాష్ట్రం రాకుండా కేవీపీ రామంచంద్రరావే అడ్డుపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే ప్రత్యేక రాష్ట్రానికి అడ్డుపడుతున్న ఆంధ్ర ప్రాంత నేతల ఇళ్ల ముందు సడక్ బంద్ నిర్వహించాలని కోదండరాంకు సూచించారు.