: శ్రీహరి మృతికి పలువురి సంతాపం


సినీ నటుడు శ్రీహరి మృతికి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, టీడీపీ నేత హరికృష్ణ, మంత్రి డీకే అరుణ, సినీ నటుడు ఏవీఎస్ తదితరులు సంతాపం తెలిపారు. శ్రీహరి కాలేయ సంబంధ సమస్య కారణంగా ఈ సాయంత్రం ముంబయి లీలావతి ఆసుపత్రిలో మరణించారు. హిందీలో దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'రాంబో రాజ్ కుమార్' చిత్రంలో శ్రీహరి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటాహుటీన లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు.

  • Loading...

More Telugu News