: 14 మంది ప్రాణాలు కాపాడి.. ప్రాణం విడిచిన డ్రైవర్


తనను నమ్ముకున్న 14 మంది ప్రాణాలు కాపాడి తాను ప్రాణమొదిలాడు చెన్నైలో ఒక బస్సు డ్రైవర్. వివరాల్లోకెళితే.. సంపత్(45) ఒక ప్రైవేటు విమానయాన సంస్థ బస్సుకు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సంస్థ సిబ్బందిని విమానాశ్రయానికి తీసుకెళ్ళడం, తీసుకురావడం అతని బాధ్యత. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా 14 మందిని చైన్నైలోని ఓ ప్రముఖ హోటల్ కు తీసుకెళుతున్నాడు. దారిలో ఉండగానే అతినికి తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. దీంతో ఓ చేత్తో ఛాతీ పట్టుకుని మరో చేతితో స్టీరింగ్ నియంత్రిస్తూ బస్సును ట్రాఫిక్ నుంచి తప్పించి మెల్లగా ఓ బస్టాండ్ వరకు తీసుకెళ్లాడు. బస్సు ఆపుతూనే స్టీరింగ్ మీదకు ఒరిగిపోయాడు. బస్సులోని ప్రయాణీకులు అంబులెన్స్ ను పిలిచినా అతని ప్రాణాలు కాపాడలేకపోయారు. 'మాసివ్ కార్డియాక్ అరెస్ట్' కారణంగా అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ప్రాణంపోతున్నా విధి నిర్వర్తించి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన సంపత్ కి సంస్థ సిబ్బంది నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News