: జైలు నుంచి విజయసాయి రెడ్డి విడుదల
ఆడిటర్ విజయసాయి రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నాలుగు నెలల నుంచి జైల్లో ఉంటున్న ఆయనకు సీబీఐ కోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు విడుదలయ్యారు. ఇప్పటివరకు ఈ కేసు నుంచి జగన్ తో సహా ఐదుగురు విడుదలయ్యారు. కాగా, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, మాజీ మంత్రి మోపీదేవి వెంకటరమణ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ పై బయట ఉన్నారు.