: అక్టోబర్ 19న మాల్దీవుల అధ్యక్ష పదవికి మరోసారి ఎన్నికలు


ఈ నెల 19న మరోసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్టు మాల్దీవుల ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సెప్టెంబర్ 7న జరిగిన ఎన్నికలలో అవకతవకలు జరిగాయని మాల్దీవుల సుప్రీం కోర్టు ఆ ఎన్నికను రద్దుచేసింది. అయితే సెప్టెంబర్ 7న జరిగిన ఎన్నికలను... భారత్ తో పాటు కామన్వెల్త్, యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన పరిశీలకులు, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు పరిశీలించారు. వీరంతా ఎన్నికలు సక్రమంగా జరిగాయని తెలిపారు.

సెప్టెంబర్ లో జరిగిన ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ 45.45 శాతం ఓట్లను గెలుచుకున్నారు. అయితే ఒక అభ్యర్థి సంపూర్ణ మెజారిటీతో గెలవాలంటే 50 శాతం ఓట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. మొహమ్మద్ నషీద్ 20 నెలల క్రితం సైనిక బలగాల ఒత్తిడితో అధ్యక్ష పదవి నుంచి బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News