: కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం.. సీఎంపై తిరుగుబాటు


అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వీరంతా కలసి సీఎంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాశారు. సిద్ధరామయ్య వ్యవహారశైలిని విమర్శిస్తూ వారు హైకమాండ్ కు మొరపెట్టుకున్నారు. 2006లో జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సిద్ధరామయ్య... మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న తమపై కక్షగట్టి సాధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అతనితో పాటు జనతా పార్టీలో పనిచేసిన కొంతమందితో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులతో ఒక కోటరీని ఏర్పాటు చేసుకుని మిగిలిన వారిని కరివేపాకులా తీసిపారేస్తున్నారని విమర్శించారు. కోటరీలో ఉన్న ఎమ్మెల్యే బసవరాజ్, మాజీ ఐపీఎస్ అధికారి కెంపయ్యతో పాటు మరి కొందరు సీఎం అండతో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. దీనికి తోడు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుందని లేఖలో విమర్శించారు.

సీఎం కావాలన్న తన కోరికను తీర్చుకున్న సిద్ధరామయ్య... కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేయడం లేదని.. కనీసం ప్రభుత్వ బోర్డులకు సంబంధించిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా చేపట్టడంలేదని మండిపడ్డారు. దీనికి తోడు, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర కూడా సీఎం పనితీరును తప్పుబడుతున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో 30 శాతం జనాభా ఉన్న లింగాయత్, వక్కలిగ కులాల వారు కూడా సిద్ధరామయ్యను వ్యతిరేకిస్తున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News