: సీఎం, మాజీ డీజీపీ దినేశ్ పై కోర్టుకెక్కనున్న శంకర్రావు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ డీజీపీ దినేశ్ రెడ్డిలపై మాజీ మంత్రి శంకర్రావు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. దినేశ్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి కిరణ్ పై పలు సంచలన ఆరోపణలు చేశారు. ఒక హత్య కేసులో మంత్రికి సంబంధించి కీలక ఆధారాలను ముఖ్యమంత్రికి అందించినా సదరు మంత్రిని సీఎం కొనసాగించారన్నారు. దీంతో.. ఆ మంత్రి ఎవరో దినేశ్ రెడ్డి ఆధారాలతో బయటపెట్టాలని శంకర్రావు డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, దినేశ్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేస్తానని చెప్పారు.