: అలిపిరి వద్ద స్వామివారి గొడుగుల తనిఖీ
గరుడోత్సవం సందర్భంగా చెన్నై నుంచి శ్రీవారికి సమర్పించడానికి 13 గొడుగులను తీసుకొచ్చారు. వాటిని అలిపిరి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఈ గొడుగులలో రెండింటిని పద్మావతి అమ్మవారికి సమర్పించనున్నారు. 11 గొడుగులను శ్రీనివాసుడి సేవలకు వినియోగిస్తారు. కొద్దిరోజుల క్రితం పుత్తూరులో అరెస్టయిన తీవ్రవాదులు శ్రీవారి గొడుగుల్లో బాంబు అమర్చి పేలుళ్ళకు పాల్పడేందుకు వ్యూహం పన్నారన్న నేపథ్యంలో వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.