: గవర్నర్ కు టీఆర్ఎస్ నేతలు వినతిపత్రం సమర్పణ
గవర్నర్ నరసింహన్ కు టీఆర్ఎస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అందుకు కారణమైన ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి శాంతిభద్రతలను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. సీఎం కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపించారని వారు వినతిపత్రంలో ఆరోపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేత వివేక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్రులు ఉద్యమం చేయడంలేదన్నారు. రాయలసీమ వాసులు చెన్నై, బెంగళూరు వెళ్లిపోయారని, ఉద్యమం చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. విజయనగరంలో బొత్స ఇంటిపై కిరణ్ మద్దతుదారులే దాడులు చేస్తున్నారని విమర్శించారు.