: చెలరేగిన భువనేశ్వర్.. ఆసీస్ 62/3
యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలింగ్ కు ఆసీస్ కంగుతింది. బౌలింగ్ లో పెద్దగా పేస్ లేకున్నా కొత్తబంతితో వికెట్ కు ఇరువైపులా స్వింగ్ చేసిన భువనేశ్వర్ ఆసీస్ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్లిద్దరితోపాటు ప్రమాదకర వాట్సన్ (23) ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 62/3.