: వైఎస్సార్సీపీలో చేరుతున్న విశ్వరూప్
కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలో చేరుతున్న నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది. అదను, అవకాశం చూసి జగన్ గూట్లోకి చేరుతున్నారు హస్తం నేతలు. ఈ క్రమంలోనే ఈనెల 18న జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు మాజీమంత్రి విశ్వరూప్ వెల్లడించారు. ఆయన విభజన ఆగదని తెలిశాకే మంత్రి పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. సమైక్యాంధ్రకే తన మద్దతని చెప్పారు.