: పండుగ వేళ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంకులు
విజయదశమి వేళ నూతన వస్తువులు కొనడాన్ని, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడాన్ని శుభసూచకంగా చాలామంది పరిగణిస్తుంటారు. సరిగ్గా పండుగకు ముందు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, వాహనాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, వాహనాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులను కోరింది. దీనికి అనుగుణంగా ఐడీబీఐ, ఓబీసీ, పీఎన్ బీ రుణాలపై వడ్డీ రేటును తగ్గించాయి. ఐడీబీఐ గృహరుణాలపైనా వడ్డీ రేట్లను తగ్గించడం విశేషం. కానీ, ఓబీసీ, పీఎన్ బీ మాత్రం గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించడానికి అవకాశాలు లేవని స్పష్టం చేశాయి.