: చంద్రబాబుపై చర్య తీసుకోండి: హోం శాఖకు రెసిడెంట్ కమిషనర్ లేఖ
నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ భవన్ ప్రాంగణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారు. కాగా, బాబు దీక్షా శిబిరానికి సదుపాయాలు తొలగించాలని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ నిన్న సిబ్బందిని ఆదేశించిన సంగతి తెలిసిందే.