: కృష్ణా జిల్లాలో విద్యుత్ కోత తీవ్రం


నాలుగు రోజులుగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె కారణంగా సీమాంధ్రలో విద్యుత్ కోత మరింత పెరిగింది. దాంతో, కృష్ణా జిల్లాలో విద్యుత్ వెతలు తీవ్రమయ్యాయి. గంటలు గంటలు పవర్ ఇక్కట్లు ఎదురవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్టీపీఎస్ ఉద్యోగుల సమ్మెతో 1770 యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు తదితర ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News