: విజయనగరంలో రెండు గంటల పాటు కర్ఫ్యూ సడలింపు
విజయనగరంలో కర్ఫ్యూ నాలుగో రోజు కూడా కొనసాగుతోంది. అయితే, ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కర్ఫ్యూని సడలించారు. ఉదయం 7 గంటలకు కర్ఫ్యూని సడలించగానే జనం ఒక్కసారిగా రోడ్లపైకి చేరుకున్నారు. కూరగాయల దుకాణాలు, కిరాణా, పెట్రోలు బంకుల వద్ద బారులు తీరారు. దుకాణాల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.