: నేడు విదేశీ పర్యటనకు బయల్దేరనున్న ప్రధాని
ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు బ్రూనై, ఇండోనేషియా దేశాల పర్యటనకు బయల్దేరనున్నారు. ఆగ్నేయాసియా దేశాలతో భద్రత, సాంస్కృతిక సహకారం పెంపొందించుకోవడంతో పాటు ఆర్థిక ఒప్పందాలు చేసుకునే క్రమంలో ఆయన నాలుగు రోజుల పాటు ఈ దేశాల్లో పర్యటించనున్నారు. 2013 చివరి నాటికి ఆగ్నేయాసియా దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకునే ప్రయత్నాల్లో ఉండటంతో... ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతోపాటు, బ్రూనైలో ప్రధాని మన్మోహన్ ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తో యురేనియం అమ్మకంపై చర్చించనున్నారు.