: ఏపీ భవన్ లోకి టీడీపీ శ్రేణులకు అనుమతి నిరాకరణ
తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీలోని ఏపీ భవన్ లో చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరుకుంది. తమ నాయకుడి దీక్షకు మద్దతు తెలపడానికి రాష్ట్రం నుంచి భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఢిల్లీకి తరలివెళ్లారు. వీరంతా ఏపీ భవన్ చేరుకుని తమ అధినేతను కలవడానికి ప్రయత్నించారు. అయితే, ఏపీ భవన్ సిబ్బంది వీరిని లోపలకు అనుమతించడం లేదు. దీంతో టీడీపీ శ్రేణులకు, ఏపీ భవన్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అధికారుల తీరుపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.