: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో ఈ రోజు వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పలమనేరు సమీపంలో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమవగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తులు బెంగళూరుకు చెందినవారుగా తెలుస్తోంది.