: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వాస్తవమే: పనబాక లక్ష్మి


రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఉన్నమాట వాస్తవమేనని మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు అదనంగా గ్యాస్ కేటాయించాలని ప్రధానిని కోరామని ఆమె తెలిపారు. విద్యుత్ కోతపై ముఖ్యమంత్రి కిరణ్ కూడా పలుమార్లు కేంద్రాన్నిఅభ్యర్ధించారన్నారు. అయితే తమ అభ్యర్ధనకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

గుంటూరు జిల్లా బాపట్లలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన పనబాక.. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోలు ధరలు పెంచే అధికారం కేవలం చమురు సంస్థలకే ఉందని పేర్కొన్నారు. కాబట్టే పెట్రోల్ ధరలు పెంచాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News