: ముఖ్యమంత్రితో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలం


సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు కాస్సేపటి క్రితం ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించాలని ముఖ్యమంత్రి తమను కోరారనీ, అయితే తమ డిమాండు నెరవేరినప్పుడే తాము సమ్మె విరమిస్తామని స్పష్టం చేశామని భేటీ అనంతరం ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సమైక్యాంధ్ర తమ డిమాండు అనీ, దానిపై ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందనీ ఉద్యోగుల ప్రతినిధులు తెలిపారు. అత్యవసర సేవలకు కూడా మినహాయింపు లేదని వారు తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News