: సీఎస్ తో మాట్లాడిన రైల్వే జీఎం


సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో రైళ్ళకు బ్రేకులు పడ్డాయి. విద్యుత్ కొరత కారణంగా పలు రైళ్ళను నిలిపివేశారు. దీంతో, దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే మిట్టల్ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో మాట్లాడారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు మిట్టల్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అవసరమైతే గూడ్సు రైళ్ళు నిలిపివేసి వాటి ఇంజిన్లను ప్రయాణికుల రైళ్ళకు వినియోగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News