: ప్రభుత్వ పథకాలు ఉద్యమంలా ప్రచారం చేయాలి: డీకే అరుణ
ప్రభుత్వ పథకాల ప్రచారం ఉద్యోగంలా కాకుండా ఉద్యమంలా చేయాలని సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి డీకే అరుణ సూచించారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువకావాలంటే కళాకారుల ఆహార్యం, హావభావాలు, మాట, పాట చక్కగా ఉంటేనే ఆకట్టుకోగలవని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమాచార, పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన కళాజాత నమూనా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద వ్యక్తి వద్దకు పథకాలను చేర్చడమే కళాజాత ముఖ్యోద్దేశమన్నారు.