: మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు


వరంగల్ జిల్లా మేడారంలో జరిగే జాతరకు 3,561 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. మొదటిసారిగా సూపర్ లగ్జరీతో సహా, ఇంద్ర ఏసీ సర్వీసులను కూడా జాతరకు నడుపుతున్నట్లు వెల్లడించారు.కోటిమంది భక్తులు హాజరయ్యే మేడారం జాతరకు ప్రత్యేక సర్వీసులతో పాటు ప్రయాణీకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. జేఎన్ఎన్ యూఆర్ఎం పథకం ద్వారా 737 బస్సులు ఆర్టీసీకి రానున్నాయని వెల్లడించారు. కాగా, సీమాంధ్రలో కార్మికుల సమ్మెవల్ల ఆర్టీసీకి 650 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో ఖాన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు విషయాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News