: శ్రీనివాసన్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్
బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టవచ్చంటూ సుప్రీం కోర్టు ఎన్. శ్రీనివాసన్ కు పచ్చ జెండా ఊపింది. అయితే, ఆయనకు ఓ షరతు విధించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఐపీఎల్ వ్యవహారాల్లో తలదూర్చరాదని ఆదేశించింది. అంతేగాకుండా, ఐపీఎల్-6లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ అంశాలపై నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వం వహిస్తారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. బీహార్ క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.