: సీఎంతో అసంపూర్ణంగా ముగిసిన విద్యుత్ ఉద్యోగుల చర్చలు


ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీతో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఈ సమావేశం సీఎం క్యాంప్ ఆఫీసులో దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఈ సందర్భంగా సమ్మెను విరమించాలని విద్యుత్ జేఏసీ నేతలను ముఖ్యమంత్రి కోరారు. సమ్మె విరమణకు సంబంధించి అన్ని జిల్లాల జేఏసీ నేతలతో మాట్లాడిన తర్వాత... తమ నిర్ణయాన్ని తెలుపుతామని జేఏసీ నేతలు సీఎంకు తెలిపారు. దీనికోసం రేపటి వరకు సమయం కావాలని కోరారు. అయితే, పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని... ఈ రోజే నిర్ణయాన్ని తీసుకోవాలని విద్యుత్ జేఏసీ నేతలను సీఎం కోరారు. దీంతో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మరోసారి సమావేశం కావాలని కేబినెట్ సబ్ కమిటీ, ఉద్యోగ జేఏసీ నేతలు నిర్ణయించారు. సమావేశం సందర్భంగా రాష్ట విభజనతో వచ్చే కష్ట, నష్టాలను సీఎంకు వివరించినట్టు జేఏసీ నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News