: సీతారాం ఏచూరిని కలిసిన విజయమ్మ
వైఎస్సార్పీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు ఢిల్లీ వెళ్ళారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచేందుకు సహకారం అందించాలని విజయమ్మ.. ఏచూరిని కోరారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ, తాము మొదటి నుంచి సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని, ఇప్పుడు తమతో వైఎస్సార్సీపీ కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పరిణామం శుభసూచకమని పేర్కొన్నారు.