: హామీ ఇచ్చేవరకు సమ్మె విరమించం: అశోక్ బాబు
ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సమ్మె విరమించేది లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మరోసారి స్పష్టం చేశారు. విభజనపై అసెంబ్లీలో తీర్మానం వచ్చినప్పుడు వ్యతిరేకిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయని ఎంపీలు, కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు మరోసారి ధర్నాలు చేస్తామన్నారు. విద్యుత్ లేక ప్రజలు అల్లాడుతున్నా ఎంపీలు పట్టించుకోవడంలేదన్నారు. ఈ నెల 10న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించిన అశోక్ బాబు ఈ నెల 11 లేదా 12న సమావేశమై ఢిల్లీ కార్యక్రమాన్ని ఖరారు చేస్తామని చెప్పారు.