: రాష్ట్ర విభజనపై పిటిషన్ కొట్టివేత


రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోం శాఖ కార్యదర్శులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ పై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.

  • Loading...

More Telugu News