: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు సంరంభం ప్రారంభమైంది. హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది. హైదరాబాదీ మాజీ ఆటగాడు వీవీయస్ లక్ష్మణ్ తన సొంత గడ్డపై కామెంటరీ చెప్పనుండడం ఈ మ్యాచ్ కి హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇటీవల దిల్ షుఖ్ నగర్లో జరిగిన బాంబు పేలుళ్ళ దృష్ట్యా స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.