: డిగ్గీరాజాతో డీఎస్ భేటీ
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్రం హైదరాబాదును తన ఆధీనంలో ఉంచుకోబోతోందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు నేతలు హస్తినలో జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఇవ్వాలని డీఎస్.. డిగ్గీరాజాను కోరనున్నారు.