: రామగుండంలో నిలిచిన 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి
రామగుండం ఎన్టీపీసీలో 3వ యూనిట్ లో సాంకేతిక లోపం కారణంగా 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ లో ట్యూబ్ లీకేజీని గుర్తించిన అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్టీపీసీలో 2000 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది.