: దేశంలో స్ప్రయిటే నెంబర్ 1 డ్రింక్


దేశీయ మార్కెట్లో టాప్ సాఫ్ట్ డ్రింక్ గా దశాబ్దాలుగా ఉన్న థమ్స్ అప్ ను స్ప్రయిట్ వెనక్కినెట్టి నంబర్ 1 స్థానానికి చేరుకుంది. మూడు నెలలుగా అత్యధికంగా విక్రయింపబడుతున్న కూల్ డ్రింక్ గా స్ప్రయిట్ ముందున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. మార్కెట్ పరిశోధనా సంస్థ నీల్సన్ గణాంకాల ప్రకారం ఆగస్టులో థమ్స్ అప్ కు కూల్ డ్రింక్స్ మార్కెట్లో 15.3శాతం వాటా ఉండగా, స్ప్రయిట్ వాటా 15.6శాతంగా నమోదు అయింది. ఈ రెండు బ్రాండ్లు కూడా కోకాకోలాకు చెందినవే. 1977లో థమ్స్ అప్ కు రూపకల్పన చేసిన రమేష్ చౌహాన్ దీనిపై మాట్లాడుతూ.. హెచ్చుస్థాయిలో మార్కెటింగ్ ప్రచారంతో పాటు, నిమ్మ రుచిని సహజంగానే ఇష్టడపడడం వల్ల ఎక్కువ మంది స్ప్రయిట్ ను తాగుతున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News