: దీక్షకు అనుమతి లేదంటూ చంద్రబాబుకి ఏపీ భవన్ అధికారుల నోటీసు
ఏపీ భవన్ లో చంద్రబాబు చేస్తున్న దీక్షకు అనుమతి లేదని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ భవన్ ప్రాంగణంలో చేస్తున్న దీక్షను వెంటనే ఆపేసి, దీక్షా స్థలిని ఖాళీ చేయాలని అధికారులు కోరారు. దీనికి సంబంధించిన నోటీసును చంద్రబాబుకు అందజేశారు. నిబంధనల ప్రకారం ఇక్కడ కేవలం మీడియా ప్రతినిధులతో సమావేశానికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. దీంతో, ఏపీ భవన్ అధికారుల వైఖరిపై చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటికిప్పుడు చంద్రబాబును అక్కడ నుంచి తరలించేందుకు ఏపీ భవన్ అధికారులు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అధికారులు ఈ రోజు కేవలం నోటీసుతోనే సరిపెట్టుకునే అవకాశమున్నట్టు సమాచారం.