: సీమాంధ్రులు ఉద్యమాన్ని విరమించాలి: దిగ్విజయ్
విభజన నేపథ్యంలో సీమాంధ్రలో తలెత్తిన తీవ్ర ఉద్యమాన్ని విరమింపజేసేందుకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ నానా తంటాలు పడుతున్నారు. రోజుకో ప్రకటనతో భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని విరమించాలని మరోసారి కోరుతున్నానన్నారు. ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంపై ఇప్పుడు వెనక్కి వెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేసిన దిగ్విజయ్, పార్టీలన్నీ లిఖిత పూర్వకంగా అనుమతి తెలిపాకే నిర్ణయం తీసుకున్నామని పునరుద్ఘాటించారు.