: ఢిల్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం రోజుకో మలుపు తిరుగుతుండటంతో... రాష్ట్రంలోని కీలక నేతలంతా ఒక్కొక్కరే హస్తిన బాట పడుతున్నారు. హైదరాబాదును కేంద్రం తన కంట్రోల్ లో ఉంచుకోబోతోందన్న దిగ్విజయ్ వ్యాఖ్యలు తెలంగాణ నేతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో, డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ హుటాహుటీన హస్తిన బయలుదేరి వెళ్లారు. కొద్ది సేపటి క్రితమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. దేశ రాజధానిలో ఆయన పలువురు కాంగ్రెస్ పెద్దలను కలసి టీ నోట్ లో పేర్కొన్న విధంగానే తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరనున్నారు.

  • Loading...

More Telugu News