: రెండో రోజుకు చేరుకున్న చంద్రబాబు దీక్ష
ఢిల్లీలో చంద్రబాబు దీక్ష రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ టీడీపీ అధినేత దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగువారి ప్రయోజనాలు కాపాడడం కోసం చేసే దీక్షకు కూడా ఇటలీ మహిళ అనుమతి తీసుకోవాలా? అని మండిపడ్డారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా నిన్న రాత్రి వెయ్యి మంది టీడీపీ కార్యకర్తలు సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు.