: బాబ్లీతో రాష్ట్ర ఆయకట్టుకు ముప్పు: సీపీఎం రాఘవులు బహిరంగ లేఖ
బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలోని 16.5 లక్షల ఎకరాలకు నీరు అందదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులోని భూములకు విఘాతం కలుగుతుందని విమర్శిస్తూ రాఘవులు బహిరంగ లేఖ రాశారు.
కేవలం 60 టీఎంసీల నీటి సామర్థ్యానికి మహారాష్ట్రకు అనుమతి ఉండగా 100 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా బాబ్లీ ప్రాజెక్టు నిర్మించారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా బాబ్లీప్రాజెక్టులో అక్రమ కట్టడాలని కూల్చేలా... కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్ర సర్కార్ ఒత్తిడి తీసుకురావాలని రాఘవులు లేఖలో పేర్కొన్నారు.