: కంప్యూటరును సులభంగా నేర్చుకోవచ్చు


కంప్యూటరు వాడకాన్ని సులభంగా నేర్చుకోవడానికి ఒక కొత్తరకం సాఫ్ట్‌వేర్‌ను పరిశోధకులు రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ కంప్యూటర్‌కు సంబంధించిన అన్ని షార్ట్‌కట్‌లను మనకు ఇట్టే తెలియజేస్తుంది. దీంతో కంప్యూటర్‌పై మరింత వేగంగా పనిచేయడానికి వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా కంప్యూటర్‌ను వాడేవారు కీబోర్డ్‌ షార్ట్‌ కట్‌లను వాడితే పనిలో మరింత వేగం పెరుగుతుందని తెలిసినా వాటన్నింటినీ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి షార్ట్‌కట్‌లకన్నా మౌస్‌పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలాకాకుండా ఈ షార్ట్‌కట్‌లను మనకు ఎప్పటికప్పుడు తెలియజేసేలా సదుపాయం ఉంటే... ఇలాంటి సదుపాయాన్ని కలిగించడానికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌ కంప్యూటర్‌పై పనిచేస్తున్న సమయంలో ఎప్పటికప్పుడు కీబోర్డ్‌ షార్ట్‌కట్‌లను మనకు తెలియజేస్తుందట. జర్మనీకి చెందిన సార్లాండ్‌ విశ్వవిద్యాలయ మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫర్మేటిక్స్‌కు చెందిన అధ్యయనకర్త జిల్లెస్‌ బెయిలీ ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొదించాడు.

ఈ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసుకున్న తర్వాత మనం పనిచేసే సమయంలో నిర్దేశిత కీ నొక్కితే ఆ పనికి సంబంధించిన అన్ని షార్ట్‌కట్‌లు మానిటర్‌పైన కొద్దిసేపు కనిపిస్తాయట. ఈ విషయాన్ని గురించి ఈ సాఫ్ట్‌వేర్‌ రూపకర్త బెయిలీ మాట్లాడుతూ యాపిల్‌ కీబోర్డులో ఈ నిర్దేశిత కీగా కమాండ్‌ ఉంటుందని, విండోస్‌ కీబోర్డుల్లో కంట్రోల్‌ కీని ఉపయోగించాలని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News