: సీమాంధ్ర కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
సీమాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, డీజీపీ ప్రసాదరావు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి దుండగులు ప్రవేశించకుండా భద్రతపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆందోళనల నేపథ్యంలో, కోరితే అదనపు బలగాలను తరలిస్తామని వారికి స్పష్టం చేశారు.