: బాబు దీక్షకు అనుమతి లేదా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన దీక్షకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఏపీభవన్ ప్రాంగణంలో ఆయన చేస్తున్న దీక్షకు అనుమతి లేదని ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర విషయాలు తెలియాల్సి ఉంది. కాగా, బాబు దీక్షకు జేడీయూ నేత శరద్ యాదవ్ సంఘీభావం తెలిపారు.