: మాపైనే దాడులా?.. చూస్తూ ఊరుకోం: గంటా


విభజనకు మద్దతిస్తున్నాడంటూ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆస్తులపై విజయనగరంలో దాడులు జరగడం పట్ల మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం తగదన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, బొత్స ఆస్తులపై దాడిని తాము కాంగ్రెస్ పార్టీపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నామని చెప్పారు. ఇలాంటి దాడులను చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. అయితే, సీఎం కిరణ్ తో పోల్చితే బొత్స పెద్దగా సమైక్యవాదాన్ని వినిపించలేదన్న భావం ప్రజల్లో ఉందని తెలిపారు. బొత్సకు కొన్ని పరిమితులున్నాయని, అందుకే ఆయన తన అభిప్రాయాన్ని బలంగా వినిపించలేకపోయారని గంటా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News