: సీమాంధ్ర విద్యుత్ జేఏసీ సమ్మెలో మార్పులు
సీమాంధ్ర విద్యుత్ జేఏసీ కాస్త మెత్తబడినట్టు కనిపిస్తోంది. ఇకమీదట విద్యుత్ సరఫరాను ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిలిపివేసి, రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ జేఏసీ నేత సత్యానందం తెలిపారు. ఈ ఉదయం విజయవాడలో సమావేశమైన సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు ఈ మేరకు నిర్ణయించారు. కాగా, విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో గృహ వినియోగదారులకు అసౌకర్యం కలగడమేగాకుండా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ళు నిలిచిపోయాయి.