: విమానం మరుగుదొడ్లో 32 కేజీల బంగారం బిస్కెట్లు
అది తెల్లవారుజామున 5 గంటల సమయం..! దుబాయి నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దుబాయి నుంచి వచ్చిన మహమ్మద్ ముస్తఫాను రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించగా.. విమానం మరుగుదొడ్లో 32 కేజీల బంగారం బిస్కెట్లను దాచి ఉంచిన విషయాన్ని వెల్లడించాడు. వీటి విలువ 15 కోట్ల రూపాయలు. ముస్తఫా తెచ్చిన బిస్కెట్లను అదే విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లేందుకు మరో ఇద్దరు చెన్నై విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న విషయం కూడా వెలుగు చూసింది. రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు ముస్తఫా దొరికి ఉండకపోతే చెన్నై విమానాశ్రయంలో బోర్డింగ్ పాసులతో ఉన్న ఇద్దరు అదే ఎయిర్ ఇండియా విమానం ఎక్కేసి మరుగుదొడ్లో దాచి ఉంచిన 32 కేజీల బంగారం బిస్కెట్లతో ఢిల్లీలో దిగిపోయి ఉండేవారు.