: థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుంది: ములాయం సింగ్
2014 ఎన్నికల అనంతరం తృతీయ కూటమి కచ్చితంగా ఏర్పడుతుందని, అయితే ప్రధాని అభ్యర్ధిని తామింకా ఎంపిక చేయలేదని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తృతీయ కూటమి ఏర్పడితే ఎవరు ప్రభుత్వాన్ని నడుపుతారన్న ప్రశ్నకు లక్నోలో మీడియా సమావేశంలో ములాయం పైవిధంగా సమాధానం ఇచ్చారు. తృతీయ కూటమే అభ్యర్ధిని ఎంపిక చేస్తుందన్నారు. దీనిపై లెఫ్ట్ నేతలతో తమ పార్టీ చర్చిస్తుందని చెప్పారు. అంతేగాక త్వరలో సీపీఎం జనరల్ సెక్రెటరీ ప్రకాశ్ కారత్ తో సమావేశమై ఈ అంశంపై చర్చిస్తానని చూచాయగా తెలిపారు.