: జైల్లో లాలూను కలిసిన రాష్ట్రపతి కుమారుడు
రాంచీలోని బిస్రా ముండా సెంట్రల్ జైల్లో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ అభిజిత్ ముఖర్జీ (ఆదివారం) కలిశారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు వీరిద్దరు మాట్లాడుకున్నారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. సోనియా, రాహుల్ లు లాలూకు సహాయం చేసేందుకే అభిజిత్ ను పంపారని ఆ పార్టీకి చెందిన ఓ నేత ఆరోపించారు. దాణా స్కాంలో దోషిగా రుజువవడంతో సీబీఐ కోర్టు లాలూకు ఐదు సంవత్సరాల శిక్ష విధించిన సంగతి తెలిసిందే.