: సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో కష్టాలు
సీమాంధ్రలో చాలా ప్రాంతాలలో ఈ రోజు కూడా కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఏడు యూనిట్లు, విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, కడపలోని ఆర్టీపీపీలోనూ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖ, కృష్ణా జిల్లాలలో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడమే కాకుండా సబ్ స్టేషన్ల ముట్టడికి ప్రయత్నిస్తూ ఉండడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.